Papa Agave Full Telugu Video Song

By Lyricsara

యంగ్ అండ్ డైనమిక్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సరికొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’. ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ రూపంలో మరో వైవిధ్యభరితమైన రోల్ తో మన ముందుకు రాబోతున్నాడు. అతిత్వరలోనే విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచేసింది. ఈ నేపథ్యంలో మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సినిమాలోని ‘పాప ఆగవే’ సాంగ్ ని తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. అంతేకాదు, ఈ సాంగ్ చూసి చాలా బాగుందని చిత్ర యూనిట్‌ని అభినందించారు కూడా.

మెలోడియస్ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట రిలీజైన కొద్దిసేపటికే యూత్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకొంది. ఓ ప్రేమికుడు తన ప్రేయసిపై ఉన్న ఫీలింగ్స్ ని బయటపెడుతూ ఆమె వెంట పడటం చాలా రొమాంటిక్ గా ఉంది. ‘వదలనే వదలనే నిన్నే నేను వదలనే’ అంటూ పలికిన ఆ లిరిక్స్ కి ప్రేమికులు ఫిదా అయిపోయారు.

‘పాప ఆగవే’ అంటూ సాగిన ఈ పాటకి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా; భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. ఇక సింగర్ కారుణ్య ఆలపించారు. ఈ సాంగ్ లో హీరోహీరోయిన్స్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ ల రొమాంటిక్ సీన్స్ పాటకే హైలైట్ గా మారాయి.

విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునీల్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లాన్స్ కి విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన సాంగ్ ఈ సినిమాపై హైప్ పెంచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకి సిద్ధం కానుంది.

Papa Agave Full Telugu Video Song

 

SingerN. C. Karunya
SingerBhaskarabhatla
MusicSai Kartheek
Song WriterBhaskarabhatla

Papa Agave Full Telugu Video Song Telugu Lyrics

పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా
పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా

పాపం కాదటె… పంతం దేనికె
తీగె తెగేదాకా లాగితే ఎలా?
ఎందుకంత కోపం
కొంచం శాంతం శాంతం
ఊపిరి ఉన్నన్నాళ్ళు
నిన్నే నేను మరిచిపోలేనులే

నేనో గాలిపటం… నువ్వే కదా దారం
ప్రాణం నీ చేతుల్లో ఉన్నాదని మరిచిపోకులే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా ఎట్టా బతకనే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే

నువ్వే నాకు మొదటి జ్ఞాపకం
మదిలో నీదే మొదటి సంతకం
నువ్వే లేని నన్ను ఊహించుకోలేను
అర్ధం చేసుకోవే అలక మానవే
నువ్వే దూరమైతే గాలాడదే నాకు
మారం చెయ్యకుండా మాటలాడవే

మహారాణి లాగ నిన్నే చూసుకుంటా
మహారాజ యోగం పట్టేదాక సమయమీయవే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా ఎట్టా బతకనే

Papa Agave Full Telugu Video Song

Papa Agave Aagi Choodave
Choosi Chudanattu Vellake Alaa
Paapa Aagave Aagi Choodave
Choosi Choodanattu Vellake Alaa

Paapam Kaadate Pantham Denike
Theege Thegedhaaka Laagithe Elaa

Endhukantha Kopam
Koncham Shantham Shantham
Oopiri Unnannaallu
Ninne Nenu Marichipolenule

Neno Galipatam
Nuvve Kadha Daaram
Praanam Nee Chetullo
Unadaani Marichiponule

Vadalane Vadalane
Ninnu neenu Vadalaane
Vandellaina Veyyelaina
Cheyye Vadalaane
Bathakane Bathakane
Nuvve Leka Bathakane
Nuvve Cheppu Nuvlekunda
Etta Bathakaane

Vadalane Vadalane
Ninnu Neenu Vadalane
Vandellaina veyyelaina
Cheyye Vadalane

Nuvve Naaku Modati Gyaapakam
Madhilo Needhe Modhati Santhakam
Nuvve Leni Nannu Oohinchukolenu
Ardhamchesukove Alaka Maanave

Nuvve Dhooramayithe
Gaaladadhe Naaku
Maaram Cheyyakundaa Maataladave

Maharaanilaaga Ninne Choosukunta
Maharajayogam Pattedaka Samayamivvave

Vadalane Vadalane
Ninnu neenu Vadalaane
Vandellaina Veyyelaina
Cheyye Vadalaane
Bathakane Bathakane
Nuvve Leka Bathakane
Nuvve Cheppu Nuvlekunda
Etta Bathakaane

Vadalane Vadalane
Ninnu Neenu Vadalaane
Vandellaina Veyyelaina
Cheyye Vadalaane

డిస్క్లైమర్:

అన్ని హక్కులు పాటల యజమానులకే చెందుతాయి. ఈ పాట యొక్క లిరిక్స్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. దయచేసి కామెంట్ బాక్స్ లో మీ ఫీడ్ బ్యాక్ ని అందించటం మర్చిపోకండి.

Leave a Comment