Evarini Adaganu Video Song Lyrics దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ 60వ దశకంలో సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో పని చేసే రామ్ గా నటిస్తున్నాడు. ఇతను దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే రకం. అయితే ఇతనో అనాథ కావటంతో తనకు మేం ఉన్నామంటూ దేశ నలుమూలల నుంచి ఎంతోమంది బంధుత్వాలు కలుపుకొని ముందుకొచ్చేవారు.
ఈ క్రమంలోనే నేను నీ భార్యనంటూ చిరునామా లేకుండా రామ్ కు లేఖలు రాస్తుంటుంది సీతామహాలక్ష్మి అనే ఓ అమ్మాయి. ఆ లెటర్స్ చూసి ఇంప్రెస్ అయిపోయి… ఆమె ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం ప్రారంభిస్తాడు రామ్. ఈ మజిలీలో వీరిద్దరూ తమ మనసులోని ఆవేదనని ఎలా తెలపాలో… ఎవరికి తెలపాలో తెలియని తికమకలో తమ జర్నీ కొనసాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో సాగే పాటే ఇది.
ఎవరిని అడగను… అంటూ సాగే ఈ సాంగ్ ని యాజిన్ నిజార్ అద్భుతంగా గానం చేశారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చిన ఈ సాంగ్ కి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఈ అద్భుతమైన పాట ఇప్పుడు మీకోసం…
Evarini Adaganu Video Song Lyrics
Singer | Yazin Nizar |
Singer | Krishnakanth |
Music | Vishal Chandrashekhar |
Song Writer | Krishnakanth |
Evarini Adaganu Song Lyrics in English
Prapanchamantha Kore Ramude Nuvva
Seethemo Thodu Ledhugaa
Evarini Adaganu Emayyindhani
Telusuga Badhulu Raadhani
Manasuki Alusuga Pranam Nuvvani
Nammadhu Thirigi Raavani
Recommended by
Kaalam Raadhu Saayame
Maanadhu Prema Gaayame
Assalu Kaadhu Nyaayame
Muttadi Chese Dhoorame
Kshaminchaleni Kshanaale Ivaa
Prapanchamantha Kore Ramude Nuvva
Seethemo Thodu Ledhugaa
Naraalane Melese Baadha Needhigaa
Kalaithe Entha Baaguraa
Kantiki Kaanaraani Katthe Dhooyaleni
Shatruvuthoti Yuddhamaa
Usure Teesthondhi Ram Anna Nee Pilupe
Urilaa Thosthondhi Raavanna O Thalape
Kshaminchaleni Kshanaale Ivaa
Evarini Adaganu Video Song Lyrics
ప్రపంచమంత కోరే రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా
ఎవరిని అడగను… ఏమైయ్యిందని
తెలుసుగా బదులు రాదని
మనసుకి అలుసుగా… ప్రాణం నువ్వని
నమ్మదు తిరిగి రావని
కాలం రాదు సాయమే
మానదు ప్రేమ గాయమే
అస్సలు కాదు న్యాయమే
ముట్టడి చేసే దూరమే
క్షమించలేని… క్షణాలే ఇవా
ప్రపంచమంత కోరే రాముడే నువ్వా
సీతేమో తోడు లేదుగా టెన్ టు ఫైవ్
నరాలనే మెలేసే… బాధ నీదిగా
కలైతే ఎంత బాగురా
కంటికి కానరాని కత్తే దూయలేని
శత్రువుతోటి యుద్ధమా
ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే
ఉరిలా తోస్తోంది… రావన్న ఓ తలపే
క్షమించలేని క్షణాలే ఇవా